12 laborers injured in Nellore accident: నెల్లూరు జిల్లా బోగోలు మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆటోతోపాటు కారు రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాదంలో ఆటోలోని కూలీల్లో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ వైద్యశాల, నెల్లూరు వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
నెల్లూరు జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది కూలీలకు తీవ్ర గాయాలు - నెల్లూరు జిల్లాలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టి కారు
Road accident in nellore district: నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని జాతీయ రహాదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వాళ్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పనులు ముగించుకొని వెళ్తుండగా.. కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.
road accident at nellore district
కూలీలందరూ.. కావలి గ్రామీణ మండలం ఆనేమడుగు పంచాయతీ కోనేటివారిపాలెం గ్రామానికి చెందిన వారని సీఐ ఖాజావలి చెప్పారు. వీరంగా వేరుశనగ తీతకు పనులకు వెళ్లారు. పనులు ముగించుకోని తిరిగి ఆటోలో వెళ్తుండగా.. తిరుపతివైపు నుంచి కావలి వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: