ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల రోజులపాటు 11 వేల 111 లింగాలకు అర్చన - నెల్లూరులో శివలింగాలు తయారి

కార్తిక మాసంలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతాయి. ఆ ఇంట్లో మాత్రం కార్తికమాసం అంతా శివలింగాలు దర్శనమిస్తాయి. ఆ ముక్కంటిపై ఉన్న ప్రేమతో స్వయంగా ఒకవేయి నూట పదకొండు లింగాలు చేశారు. బుల్లి బుల్లి శివుని ప్రతిమలను చూస్తుంటే ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.

45 రోజుల్లో 1111శివలింగాలు తయారుచేసిన భక్తురాలు

By

Published : Nov 20, 2019, 11:34 AM IST

Updated : Nov 20, 2019, 1:08 PM IST

నెల రోజులపాటు 11 వేల 111 లింగాలకు అర్చన

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రవంతి అనే మహిళ 11వేల 111 శివలింగాలు చేశారు. 45 రోజుల్లో ఈ లింగాలు తయారు చేసినట్లు చెబుతున్నారు శ్రవంతి.

పుట్టమన్నుతో కొన్ని, అష్టగంధంతో మరికొన్ని శివలింగాలు తయారు చేశారు. రోజుకు 10 నుంచి 12 గంటలు శ్రమించి శివలింగాలు తయారు చేశారు. ఆమె ఇంటిలోని ప్రతి గదిలో లింగాలు కనిపిస్తాయి. 11వేల నూటపదకొండు లింగాలు ఒకే ఆకారంలో ఎంతో నైపుణ్యంగా సిద్ధం చేశారు.

గత ఐదేళ్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా శివునిపై భక్తితో ఇలా వినూత్నంగా తయారు చేశారు. నెల రోజులపాటు లింగాలకు పూజ చేసి... కార్తిక మాసం ఆఖరి రోజున సముద్రంలో నిమజ్జనం చేస్తారు.

ఇదీ చూడండి

ఇఫి' స్వర్ణోత్సవ సంబరాలు.. అంబరాన్నంటేలా

Last Updated : Nov 20, 2019, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details