నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 9 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 111కు పెరిగింది. కరోనా నుంచి కోలుకుని 76 మంది డిచ్ఛార్జ్ కాగా... ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం 32 మంది ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
చెన్నైలోని కోయంబేడు మార్కెట్లో కరోనా వ్యాప్తి ప్రభావం.. నెల్లూరుపైనా పడుతోందని అధికారులు చెప్పారు. తాజాగా నమోదైన 9 కేసులు కూడా.. చెన్నై మార్కెట్ తో సంబంధం ఉన్నవేనని గుర్తంచారు. జిల్లాలో కోయంబేడు మార్కెట్ తో సంబంధమున్న 252 మందిని గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్ కు తరలించారు.