రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా, 104ఉద్యోగులు నెల్లూరు జిల్లా ఉదయగిరి సమావేశమైయ్యారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న104ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.డీఎస్సీ,ఆర్ఓఆర్ ద్వారా గత12సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించి,ట్రెజరీ ద్వారా వేతనాలు అందించాలన్నారు. 104సేవలను ప్రైవేట్ సంస్థలుక అప్పగించకుండా వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
పాదయాత్ర హామీలను సీఎం నెరవేర్చాలి..104 ఉద్యోగుల డిమాండ్ - 104 employees demands for regularized duties
తమ న్యాయమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరతూ 104 ఉద్యోగులు నెల్లూరు జిల్లాలో సమావేశాన్ని నిర్వహించారు.
![పాదయాత్ర హామీలను సీఎం నెరవేర్చాలి..104 ఉద్యోగుల డిమాండ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4729745-828-4729745-1570876047366.jpg)
104 ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం
104 ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం