ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

100 feets flag : వంద అడుగుల జాతీయ జెండా... దేశభక్తి పొంగెను మది నిండా - 100-feets-flag-in-nellore-collectorate

నెల్లూరు కలెక్టరేట్​లో వంద అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవనాన్ని పురస్కరించుకుని ఈ త్రివర్ణ పతాకాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రారంభించారు.

నెల్లూరులో వంద అడుగుల జాతీయ జెండా
నెల్లూరులో వంద అడుగుల జాతీయ జెండా

By

Published : Aug 15, 2021, 4:37 PM IST

నెల్లూరులో వంద అడుగుల జాతీయ జెండా

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో వంద అడుగుల ఎత్తైన భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన త్రివర్ణపతాకాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రారంభించారు.

జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర స్ఫూర్తిని వివరించారు. ప్రజలు, ఉద్యోగుల్లో దేశభక్తిని పెంపొందించి, జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని కోరారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.

ABOUT THE AUTHOR

...view details