ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులు పంపిణీ చేసిన నందమూరి బాలకృష్ణ సేవాసమితి - నెల్లూరు తెలుగుదేశం పార్టీ తాజా వార్తలు

నెల్లూరులో నందమూరి బాలకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో 10 వేల మాస్కులను జిల్లా కలెక్టర్​కు అందజేశారు. వీటితో పాటు హోమియో మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

Nandamuri Balakrishna Seva Sammiti
నందమూరి బాలకృష్ణ సేవాసమితి 10వేల మాస్కుల విరాళం

By

Published : Apr 10, 2020, 2:07 AM IST

నందమూరి బాలకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నెల్లూరు తెలుగుదేశం పార్టీ 10 వేల మాస్కులను అందజేశారు. నగరంలోని కలెక్టర్ బంగ్లా వద్ద ఈ మాస్క్​లను తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కలెక్టర్​కు అందించారు. తొమ్మిది లక్షలు విలువ చేసే 60 వేల మాస్కులను కలెక్టర్​కు, 50 వేల మాస్కులను నగర ప్రజలకు అందజేసినట్లు శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. తెదేపా అధినేత చంద్రబాబు ముందు చూపు కారణంగానే కరోనా పరీక్షలు నిర్వహించే పరికరాలు రాష్ట్రంలో తయారు చేయగలుగుతున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details