ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్ డౌన్: రూ. 1.18 కోట్ల జరిమానా - 1.18 crore amount of fine collected during lock down time

కరోనా లాక్‌డౌన్‌ నియమాలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 1600 కేసులు నమోదు చేసి రూ.1.18 కోట్ల జరిమానా విధించినట్లు జిల్లా అదనపు ఎస్పీ పి.వెంకటరత్నం తెలిపారు.

nellore district
Iపోలీసు అధికారులకు సూచనలిస్తున్న అదనపు ఎస్పీ వెంకటరత్నం

By

Published : Apr 11, 2020, 5:07 PM IST

కరోనా లాక్‌డౌన్‌ నియమాలు ఉల్లంఘించిన వారిపై 1600 కేసులు నమోదు చేసి రూ.1.18 కోట్ల జరిమానా విధించినట్లు నెల్లూరు జిల్లా అదనపు ఎస్పీ పి.వెంకటరత్నం చెప్పారు. శుక్రవారం పొదలకూరు పట్టణంలో 144 సెక్షన్‌ అమలు తనిఖీ కేంద్రాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగొద్దన్నారు.

అంతర్‌ రాష్ట్ర, జిల్లా తనిఖీ కేంద్రాలు 121 వరకు ఏర్పాటు చేసి 24 గంటలు పహారా కాస్తున్నారని పేర్కొన్నారు. రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కర్ఫ్యూ మరింత కఠినంగా అమలు చేయాలని సూచించామన్నారు. అదనపు ఎస్పీతో పాటు పొదలకూరు ఎస్సై రహీంరెడ్డి, వారి సిబ్బంది.. గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో పర్యటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details