ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2022, 4:48 PM IST

ETV Bharat / state

'వైఎస్సార్​ సున్నావడ్డీ'లో అరకొర వసతులు.. మండుటెండ.. ఉక్కపోతతో మహిళల అవస్థలు..

YSR zero interest program: వైఎస్సార్​ సున్నా వడ్డీ మూడో విడత నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో మహిళలు అవస్థలు పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అరకొర వసతులతో మహిళలు ఇబ్బంది పడ్డారు. అధికారులు చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే జోగారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు తిరుపతిలోను ఇదే పరిస్థితి నెలకొంది.

Women difficulties in YSR zero interest program
సున్నా వడ్డీ కార్యక్రమంలో మహిళల అవస్థలు

YSR zero interest program: వైఎస్సార్​ సున్నా వడ్డీ మూడో విడత నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో మహిళలు అవస్థలు పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అరకొర వసతులతో మహిళలు ఇబ్బంది పడ్డారు. అధికారులు చేసిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే జోగారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు మండే ఎండ... మరొకవైపు ఉక్కపోత. టెంట్ల కింద ఉండేందుకు స్థలం లేకపోవడంతో కార్యక్రమం మధ్యలోనే పలువురు మహిళలు బయటికు వెళ్లిపోయారు. అదే బాటలో మరికొంత మంది వెళ్లే ప్రయత్నం చేయగా... మైదానం గేటు మూసి వెలుగు సిబ్బంది వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది బయటకు వెళ్లిపోయారు. పరిస్థితి చూసిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది మహిళలు చెట్ల కింద సేదతీరుతూ కనిపించారు.

తిరుపతి జిల్లాలోనూ: నాయుడుపేట కె.కె.కల్యాణ మండపంలో పురపాలక సంఘం పరిధిలోని 600పైగా పొదుపు గ్రూపుల మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంపై అవగాహన కల్పించేందుకు కల్యాణమండపంలో సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు పాల్గొన్నారు. పొదుపు గ్రూపుల్లోని సభ్యులు వస్తేనే ఆసరా చెక్కులు ఇస్తామని అధికారులు తెలపడంతో అందరూ వచ్చారు. కానీ అక్కడ కాకల్యాణ మండపంలో మహిళలకు స్థలం చాలలేదు. దీంతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు బయట వరండాలో, భోజనశాలలో ఉన్నారు. ఎమ్మెల్యే 12గంటలకు రావడంతో సమావేశం మొదలు పెట్టారు. ఈలోపు మహిళలు సమావేశం నుంచి వెళ్లకుండా మండపం బయట గేటుకు తాళాలు వేశారు. ఇళ్లలో పిల్లలు ఉన్నారని, పనులు ఉన్నాయని చెప్పినా తాళాలు తీయలేదు. ఫొటోలు తీయడంతో తాళాలు తీశారు. మహిళలు వాగ్వాదానికి దిగారు.

ఇదీ చదవండి: Paper leak: శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్​..! నిజం కాదన్న డీఈవో

ABOUT THE AUTHOR

...view details