VRO Santhosh Kumar Commits Suicide: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వీఆర్వో సంతోషకుమార్ ఆత్మహత్య కలకలం రేపింది. ఆత్మహత్య ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న సంతోషకుమార్(33) బుధవారం విధుల నిర్వహణ కోసం వచ్చాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంటివలస-బోరబండ రహదారిలో ఉన్న ఓ మామిడితోటలోకి వెళ్లి అక్కడ తన చొక్కాతో మామిడిచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు సంతోష్ తన భార్యకు 'నన్ను క్షమించు. పిల్లలను జాగ్రత్తగా చూసుకో" అంటూ వాట్సప్ మెసేజ్ చేశారని వెల్లడించారు.
చెట్టుకు ఉరేసుకుని వీఆర్వో ఆత్మహత్య.. కారణం అదేనా..!
VRO Santhosh Kumar Suicide: పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విధులకు హాజరైన ఓ వీఆర్వో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తాను చినపోతున్నట్లు భార్యకు వాట్సప్ ద్వారా సమాచారం అందిచి.. అనంతరం వీఆర్వో సంతోషకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడని.. మళ్లీ భార్య కంగారుపడి ఫోన్ చేసినా తీయకపోవడంతో వెంటనే ఆమె సంతోష్ స్నేహితులకు, తోటి ఉద్యోగులకు సమాచారం అందించింది. తోటి ఉద్యోగులు వెళ్లే సమాయానికే సంతోష్ మృతి చెందారని తోటి ఉద్యోగులు పేర్కొన్నారు. వీఆర్వో సంతోష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపంచనామాకు తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. రెండో కుమార్తెకు కేవలం నెలరోజుల వయస్సు మాత్రమేనని ఆయన బంధువులు పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఒత్తిడి వల్లే.. సంతోషకుమార్ అత్మహత్యకు పాల్పడినట్టు ఆయన స్నేహితులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: