Tribal Protest aganist Some Castes: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివాసీలు కదం తొక్కారు. మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ వరకు ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. బోయ వాల్మీకి, బెంతు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర నాయకులు కోలక లక్ష్మణ దొర, నిమ్మక జయరాజు, గుమ్మడి సంధ్యారాణి డిమాండ్ చేశారు. జీవో 52 శామ్యూల్ ఆనంద్ కుమార్ కమిషన్ వెంటనే రద్దు చేయాలని తెలిపారు.
వాళ్లను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు.. మన్యం జిల్లాలో కదం తొక్కిన ఆదివాసీలు
Tribal Protest: బోయ వాల్మీకి, బెంతు కులాలను ఎస్టీలో చేర్చొద్దని ఆదివాసీలు కదం తొక్కారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. కేజీబీవీ ఏకలవ్య పాఠశాలలో బోధన, బోధనేతర పోస్టులను స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కదం తొక్కిన ఆదివాసీలు
బెంతు, ఒరియా కులం దర్యాప్తునకు 2019లో నియమించిన జేసీ శర్మ కమిషన్ రిపోర్ట్ బయటపెట్టాలని కోరారు. 2017లో కేంద్ర ప్రభుత్వానికి పంపిన బోయ వాల్మీకి ప్రతిపాదనలు వెనక్కు రప్పించి.. రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ ఏకలవ్య పాఠశాలలో బోధన బోధనేతర పోస్టులను స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలని కోరారు జీవో నెంబర్ మూడు బదులు కొత్త చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
Last Updated : Dec 19, 2022, 6:00 PM IST