Andhra-Odisha border road: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే ఈ 10 కిలోమీటర్ల రోడ్డు ఎటు చూసినా గోతులమయమే. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దగ్గరి దారి కావడంతో తప్పనిసరై ప్రయాణాలు చేస్తున్నామని.. 10 కిలోమీటర్లు దాటి ఒడిశాలోకి వెళ్తే రహదారులు అద్భుతంగా ఉన్నాయని వాహనదారులు చెబుతున్నారు.
ఆంధ్రలో అడుగుకో గుంత... సరిహద్దు దాటితే మాత్రం.. - ఆంధ్ర ఒడిశా రహదారి వార్తలు
Andhra-Odisha border road : అది ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను ఒడిశాతో అనుసంధానించే రహదారి. సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఎటు చూసినా గోతులమయమే. ఆపై వాన పడితే చెరువులా మారుతుంది. ఏపీ సరిహద్దు దాటి ఒడిశాలోకి ప్రవేశిస్తే మాత్రం.. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే.. అందమైన రహదారులపై ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
Andhra-Odisha border road