Thotapalli Project Compensation: తోటపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం అందించాలని.. పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస మండలం సీమనాయుడువలస కూడలి వద్ద బాధితులతో కలిసి తెలుగుదేశం నేతలు నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా ప్రకటించిన విధంగానే ప్రతి కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పాత కళ్లికోట, బాసంగి గ్రామలతో పాటు మిగతా నిర్వాసిత గ్రామాలను ఆదుకోవాలన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. భూములను కోల్పోయిన వారికి పరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని అన్నారు. 640 జీవో ప్రకారం పరిహారం అందిచాలని డిమాండ్ చేశారు.
తోటపల్లి నిర్వాసితులకు పరిహారమివ్వాలన్న తెదేపా నేతలు
Thotapalli Project Compensation తోటపల్లి నిర్వాసితులకు పరిహారం అందించాలని తెదేపా నేతలు నిరసనదీక్ష చేపట్టారు. ఉపాధి కోల్పోయి వారు ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే న్యాయం చేయాలని కోరారు.
పరిహారం అందివ్వాలన్న తెదేపా నేతలు