Struggle to abolish CPS in Parvathipuram: సీపీఎస్ రద్దు పోరాటాన్ని జనవరి నుంచి మరింత ఉద్ధృతం చేస్తామని.. ఆంధ్ర ప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలు వంటి వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు అంటున్నారు. అప్పటికీ దిగిరాకపోతే ప్రభుత్వాన్ని దిగ్బంధిస్తామని తెలిపారు. ప్రత్యేకహోదా, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు విభజన హామీలపై.. విశాఖ పర్యటనలో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటానికి సిద్ధం కావాలని.. అందుకు ఉద్యోగ సంఘాలు సైతం కలిసివస్తాయని చెప్పారు.
సీపీఎస్ రద్దు పోరాటం జనవరి నుంచి ఉద్ధృతం: యూటీఎఫ్
Struggle to abolish CPS in Parvathipuram: సీపీఎస్ రద్దు పోరాటాన్ని జనవరి నుంచి మరింత ఉద్ధృతం చేస్తామని యూటీఎఫ్ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు పోరాటానికి సిద్ధం కావాలని.. అందుకు ఉద్యోగ సంఘాలు సైతం కలిసివస్తాయని చెప్పారు.
సీపీఎస్ రద్దు పోరాటం