పచ్చటి ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఘాట్ రోడ్డు కాబట్టి... ఇక్కడ ప్రయాణం చేసేటపుడు డ్రైవర్ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుకిరువైపులా ఎత్తయిన కొండలు, లోతైన లోయలు ఉన్నందున డ్రైవర్ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. వాహనం లోయలోకి దూసుకుపోతోంది. ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇలాంటి క్లిష్టమైన ఘాట్ రోడ్‌లో రక్షణ చర్యలు మాత్రం కరవయ్యాయి. 16 కిలోమీటర్ల ఈ ఘాట్ రోడ్‌లో ప్రహరీ, రెయిలింగ్ కరవయ్యాయి. చాలాచోట్ల గతంలో ఎప్పుడో కట్టిన ప్రహరీ శిథిలమైపోయింది. పలుచోట్ల రెయిలింగ్ విగిరిపోయింది.
ఈ ఘాట్ రోడ్డు పలుచోట్ల గోతులమయంగా మారింది. రాళ్లు తేలింది. తూతూ మంత్రంగా పనులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. కొందరు క్షతగాత్రులుగా మారుతున్నారు.