ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్పశ్రీవాణి ఆయన భిక్షతో గెలిచి.. ఇప్పుడు విమర్శలా: శత్రుచర్ల పల్లవిరాజు - ap news

Pallaviraju on Pushpasrivani: ప్రజలను మోసం చేస్తున్న వైకాపా నేతలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శత్రుచర్ల పల్లవిరాజు ఆరోపించారు. శత్రుచర్ల చంద్రశేఖరరాజు భిక్షతో గెలిచిన ఆమె.. ఇప్పుడు విమర్శలు చేయడం దారుణమన్నారు. ధైర్యం ఉంటే ఆమె ఆస్తులపై చర్చకు సిద్ధమా అని సవాల్​ విసిరారు.

pallavi raju
pallavi raju

By

Published : Jun 26, 2022, 7:02 PM IST

Satrucharla Pallavi Raju: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి... తన ఆస్తులపై చర్చించేందుకు సిద్ధమా అని తెలుగుదేశం నాయకురాలు శత్రుచర్ల పల్లవిరాజు సవాల్‌ విసిరారు. శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు భిక్షతో గెలిచిన పుష్పశ్రీవాణి.. ఇప్పుడు ఆయనను విమర్శించే స్థాయికి చేరిందని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పల్లవిరాజు మండిపడ్డారు. గడపగడపకు కార్యక్రమంలో ప్రశ్నించినవారిపై కేసులు పెడుతూ.. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలను మోసగించిన పుష్ప శ్రీవాణికి.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details