RTC Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. ప్రయాణికులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గుమ్మలక్ష్మీపురం మండలంలో మండ గ్రామ సమీపంలో వంతెన వద్ద బస్సు బోల్తా పడింది. గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎదురుగా వస్తున్న ఎక్స్ప్రెస్ బస్సును తప్పించబోయి వంతెనను ఢీకొని బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పల్లె వెలుగు బస్సు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం - పార్వతీపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది
RTC Bus Accident: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మండ గ్రామ సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి వంతెనను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరికి గాయాలు కాగా.. మిగిలిన ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
ఆర్టీసీ బస్సు