మన్యంలో డోలీ మోతలు సర్వ సాధారణంగా మారాయి. నిత్యం ఎక్కడో ఒక చోట గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు డోలీమోతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దశాబ్దాలు గడుస్తున్నా.. తరాలు మారుతున్నా.. గిరిజన గ్రామాలకు సరైన రహదారి సదుపాయాలు కరువయ్యాయి. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలలో పెట్టుకుని ఆసుపత్రి పరుగులు పెట్టాల్సిన దుస్థితి!
Doli : డోలీ దాటని గిరిజనం బతుకులు.. గర్భిణి అవస్థలు! - PREGNENT WOMEN REACHED HOSPITAL THROUGH DOLI
వారు పుట్టాలంటే డోలీ కట్టాలి.. వారు చనిపోతే మోయడానికీ డోలీ కట్టాలి.. ప్రాణం మీదికొచ్చి, బతికి బట్ట కట్టాలన్నా.. కర్రకు రెండు రెండువైపులా బట్ట కట్టాల్సిందే! డోలీ సిద్ధం చేయాల్సిందే. దశాబ్దాలుగా వారి పరిస్థితి ఇదే! కొనసాగుతున్న దుస్థితి ఇదే! నాగరిక సమాజానికి దూరంగా.. అభివృద్ధికి కనిపించనంత దూరంగా.. బతికేస్తున్న అడవి బిడ్డల అవస్థలివి. తాజాగా.. మరో ఆడబిడ్డ పురిటినొప్పుల అవస్థలు పడుతుంటే.. డోలీనే ఆధారమైంది!
డోలీ మోతలు
మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినతోలుముండ గ్రామంలో ఓ గర్భిణిని డోలీ సహాయంతో మోసుకుంటూ సమీపంలో ఉన్న రామభద్రపురం ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. జిల్లాలోని పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం మండల్లాలో గిరిజనులకు నిత్యం ఈ డోలి మోతలు తప్పడం లేదు. అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: తాజాగావైకాపాకు విజయమ్మ రాజీనామా.. షర్మిల స్పందన ఇదే..!