ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడుపై పోక్సో కేసు
POCSO Case Against Principal Of Tribal Welfare School: ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడుపై.. విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రన్సిపాల్ కృష్ణారావుపై విచారణ చేపట్టారు. విచారణ నిమిత్తం నివేదికను కలెక్టర్కు నివేదికను అందజేశారు.
POCSO Case Against Principal Of Tribal Welfare School: పార్వతీపురం మన్యం జిల్లాలో.. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులను వేధించడంతో ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. సాలూరు మండలం కురుకూటి గ్రామంలో.. ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారావుపై.. విద్యార్థినులు సాలూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణ నిమిత్తం జిల్లా కలెక్టర్ కు నివేదికను అందజేశారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు.. సాలూరు గ్రామీణ పోలీసులు నిందితుడిపై పోక్సో, ఏస్సీ-ఏస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు.