Odisha Lorry Association Leaders Filled Road Potholes in AP: ఏపీ ప్రభుత్వానికి సిగ్గు చేటు.. రాష్ట్రంలోని ఓ రహదారి మరమ్మతులు చేసిన ఒడిశా లారీ అసోసియేషన్ Odisha Lorry Association Leaders Filled Road Potholes in AP: రాష్ట్రంలోని ఓ రహదారికి ఒడిశా రాష్ట్రానికి చెందిన లారీ అసోసియేషన్ నాయకులు మరమ్మతులు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ తీరుతో విసుగు చెంది.. తమ వాహనాలు దెబ్బతింటున్నాయని స్వయంగా వారే ఈ చర్యకు పూనుకున్నారు. రోడ్ల దుస్థితిపై నిరసన చేపట్టితే.. అధికారులు నిరసన తెలిపిన ప్రాంతాల్లో గుంతలు పూడ్చి వదిలేస్తున్నారని శాశ్వత పరిష్కారం చూపటం లేదని లారీ అసోసియేషన్ నాయకులు అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ, బంగారంపేట, కునేరు గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఈ రహదారిపై.. అంతరాష్ట్రాల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు ఏపీకి, ఏపీ నుంచి వాహనాలు ఒడిశాకు ఈ దారి గుండానే తిరుగుతుంటాయి. కునేరు గ్రామ పరిధిలో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. భారీ పరిమాణంలో రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి.
Damaged Roads: చెరువుల్లా మారిన రహదారులు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం..
రోడ్డు మరమ్మత్తులకు గురి కావటంతో.. ఒడిశా లారీ యాజమానులు పార్వతీపురం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆర్ అండ్ బీ అధికారులకు తెలియజేశారు. అధికారులు స్పందించకపోవటంతో.. వారు పలుమార్లు నిరసనకు దిగారు. దీంతో నిరసనకు దిగిన సమాయాల్లో అధికారులు తూతూ మంత్రంగా నామమాత్రపు చర్యలకు దిగారు.
రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టకపోవటంతో.. విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోంటున్నామని అటుగా వెళ్తున్న వాహనాదారులు అంటున్నారు. గుంతల వల్ల రోడ్డు ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయని వివరించారు. రోడ్డుపై దుమ్ము చెలరేగి ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించటం లేవని అన్నారు. ధ్వంసమైన రోడ్ల వల్ల వాహనాలు పాడైపోతున్నాయని వాపోయారు. ఈ రోడ్ల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వివరించారు.
చెరువులను తలపిస్తున్న రోడ్లు.. వాహనదారులకు ఇబ్బందులు
ఒడిశా రాష్ట్రంలోని రాయగడకు చెందిన లారీ యాజమానులు ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్న స్పందించకపోవటంతో స్వయంగా వారే రంగంలోకి దిగారు. సొంత నిధులు సమాకూర్చికుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రోడ్డును తవ్వించి.. కంకర పోసి చదును చేయించారు. రోడ్లపై గుంతలు లేకుండా పూర్తిగా కంకర పోసి పూడ్చారు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపలని.. లేకపోతే తమ వాహనాలు పూర్తిగా ధ్వంసమవుతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం నాయకులు పాల్గొన్నారు. అధికారులు చొరవ చూపి గుంతలను పూర్తిగా పూడ్చివేసే ప్రక్రియ చేపట్టాలని సీపీఎం కోరారు. ఈ రోడ్డును బాగు చేసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే ప్రజల కష్టాలను తీర్చాలని అన్నారు.
రోడ్లపై గుంతలు.. వర్షం పడితే చిత్తడే