ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదికి భారీగా వరద నీరు చేరుతోంది. పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పార్వతిపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని దుగ్గి, కళ్లి కోట గ్రామాల్ని వరద నీరు ముంచెత్తింది. కొమరాడ మండలం పాత కళ్లికోట ముంపులో చిక్కుకోగా.. జియ్యమ్మవలస మండలంలోని బాసంగి గ్రామస్తులు వరద నీటిలో మగ్గుతున్నారు. ఏటా వర్షా కాలంలో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. నాగావళి వరద బాధితుల్ని తెదేపా నాయకులు శత్రుచర్ల పల్లవిరాజు పరామర్శించారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ముంపు గ్రామాల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నాగావళికి వరద పోటెత్తటంతో ముంపులో మన్యం గ్రామాలు - నాగావళికి వరద
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. ప్రవాహ ఉద్ధృతికి పార్వతిపురం మన్యం జిల్లాలోని అనేక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. కనీస అవసరాల కోసం వరద బాధితులు ఇబ్బంది పడుతుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
నాగావళికి వరద పోటెత్తటంతో ముంపులో మన్యం గ్రామాలు