Life Imprisonment: పార్వతీపురం జిల్లాజియ్యమ్మవలస మండలం చిన్న మేరంగి సమీపంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఏడాది క్రితం చిన్నమేరంగి సమీపంలో ఇద్దరు మైనర్ బాలికల అత్యాచారం కేసులో అదే ప్రాంతానికి చెందిన రాంబాబుకి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అతనిపై మొత్తం 24 కేసులు నమోదు అయినట్లు ఎస్పీ చెప్పారు.
బాలికలపై అత్యాచారం కేసు.. యువకుడికి యావజ్జీవం - పార్వతీపురం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Life Imprisonment: ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఏడాది క్రితం జరిగిన ఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
Etv Bharat
మహిళల రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు, జిల్లాలో మహిళలపై జరిగిన ప్రత్యేక ఘటనలకు సంబంధించిన కేసుల విషయంలో మరింత ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ముద్దాయిలకు కఠిన శిక్ష పడితే నేరం చేసేందుకు భయం ఉంటుందని,.. తప్పు ఎవరు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో గతంలో శిక్ష పడిన ఘటనలనుఎస్పీ వివరించారు.