ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 26, 2022, 5:40 AM IST

ETV Bharat / state

ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆ నోటీసులు జారీ చేయాలి'

ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే లుక్ అవుట్ నోటీసులు జారీచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేరంలో పాత్ర లేదని పేర్కొంటూ దిగువ కోర్టులో అభియోగపత్రం వేసినప్పటికీ వైద్య దంపతుల విషయంలో లుక్ అవుట్ ఉత్తర్వుల కొనసాగించడాన్ని ఆక్షేపించింది. లుక్ అవుట్ ఉత్తర్వుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

హైకోర్టు
హైకోర్టు

అరెస్ట్ , కేసు విచారణ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోవడం , తదితర ప్రత్యేక సందర్భాల్లోనే పోలీసులు లుక్ అవుట్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. నేరంలో పాత్ర లేదని పేర్కొంటూ దిగువ కోర్టులో అభియోగపత్రం వేసినప్పటికీ వైద్య దంపతుల విషయంలో లుక్ అవుట్ ఉత్తర్వుల కొనసాగించడాన్ని ఆక్షేపించింది. లుక్ అవుట్ ఉత్తర్వుల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు దంపతులను అనుమతించాలని ఇమిగ్రేషన్ అధికారికి స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు.

తన సోదరుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె భర్తతోపాటు , తమపైన వరకట్న వేధింపులు నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారని పేర్కొంటూ నెల్లూరు జిల్లాకు చెందిన వైద్యదంపతులు హైకోర్టును ఆశ్రయించారు. విదేశాలకు వెళ్లకుండా పోలీసులు తమపై లుక్ అవుట్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. నేర ఘటనలో తమకు సంబంధం లేదని తేలుస్తూ అభియోగపత్రం నుంచి తమను మినహాయించినా లుక్ అవుట్ ఉత్తర్వులు కొనసాగిస్తున్నారన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు సిద్ధంకాగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే లుక్ అవుట్ నోటీసులు జారీచేయాలన్నారు. పిటిషనర్ల విషయంలో దర్యాప్తునకు సహకరించలేదన్న ఆరోపణ తలెత్తలేదన్నారు . నేరంలో పాత్ర లేదని దర్యాప్తు అధికారి క్లీన్ షీట్ ఇచ్చాక లుక్ అవుట్ కొనసాగించడం సరికాదన్నారు. కేసు విచారణకు రావాలని న్యాయస్థానం ఆదేశిస్తే అందుకు కట్టుబడి ఉంటామని పేర్కొంటూ దిగువ కోర్టులో పూచీకత్తు ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించారు. లుక్ అవుట్ ఉత్తర్వుల ఉపసంహరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చదవండి:HIGH COURT : 'ఆ భూమిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details