Vehicle Burning in AP: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామ సమీపంలో ద్విచక్రవాహనం దగ్ధమైంది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎర్రపాడు నుంచి పెదకూటిపల్లికి ద్విచక్రవాహనంపై దంపతులు వస్తున్నారు. మధ్యలో బంధువులు కనిపించడంతో ఆగి.. బైక్ ఆన్‌లోనే ఉంచి మాట్లాడుతున్నారు. ఈలోగా ద్విచక్రవాహనంలో మంటలు చెలరేగాయి.. మంటలార్పేందుకు స్థానికులు యత్నించినా.. అప్పటికే బైక్ మొత్తం దగ్దమైంది. అప్పటికే వాసుదేవరావు దంపతులు బైక్ పైనుంచి దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
ద్విచక్ర వాహనంలో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం - Vehicle burning
Fire in two wheeler: రయ్ రయ్‌మంటూ దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మధ్యలో బంధువులు కనిపిస్తే ఆగి మాట్లాడుతున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. బండిలో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది. అప్పటికే బండి పైనుంచి వాళ్లిద్దరూ దిగడంతో ప్రాణాపాయం తప్పింది.
![ద్విచక్ర వాహనంలో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం Fire in two wheeler](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16682632-779-16682632-1666101046416.jpg)
స్కూటీ దగ్ధం