ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో విషాదం.. ఏనుగు దాడిలో రైతు మృతి - గరుగుబిల్లి మండలం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం..ఓ రైతు ప్రాణాలను తీసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళిన ఓ రైతు పై ఏనుగు దాడి చేసి.. చంపేసింది. కొమరాడ మండలం కల్లికోటకు చెందిన రైతు గోవింద ఏనుగు దాడిలో చనిపోవడం.. గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఏనుగు దాడిలో రైతు మృతి
ఏనుగు దాడిలో రైతు మృతి

By

Published : Nov 12, 2022, 11:00 AM IST

ఏనుగుల దాడిలో రైతు మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. కొమరాడ మండలం కల్లికోటకు చెందిన గోవింద రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్తుండగా గుంపు నుంచి విడిపోయిన ఏనుగు దాడి చేసింది. ఏనుగు దాడిచేయడంతో... తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిలో మరణించిన వారి సంఖ్య 8కు చేరింది. మిగిలిన ఏడు ఏనుగుల గుంపు ప్రస్తుతం గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details