Elephants పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదకుదమలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం మహిళపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా సోమవారం రాత్రి పశువుల పాకలో ఉన్న ఒక ఆవుపైనా గజరాజులు దాడికి తెగబడ్డాయి. ఇలా మనుషులు, పశువులపై దాడులు చేస్తూ పంటలు నాశనం చేయడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఏనుగుల సంచారంతో కంటిమీద కునుకులేకుండా పోతోందని... తక్షణమే వాటిని అడవిలోకి తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Elephants మన్యం జిల్లాలో గజరాజుల బీభత్సం, ముగ్గురికి తీవ్రగాయాలు - మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం
Elephants పెదకుదమలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సోమవారం రాత్రి ఆవుపైనా గజరాజులు దాడి చేశాయి. ఏనుగుల సంచారంతో స్థానికులు భాయందోళనకు గురవుతున్నారు.
గజరాజుల బీభత్సం