Elephants Attack: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం మిర్తివలసలో ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. గ్రామంలోని రైస్‌మిల్లులోకి వెళ్లిన ఏనుగుల గుంపు మిల్లుషట్టర్‌ను ధ్వంసం చేసి.. నిల్వ చేసిన ధాన్యం బస్తాలను చెల్లాచెదురు చేశాయి. మిల్లు ప్రాంగణంలోని కొబ్బరి, అరటి మొక్కలను ధ్వంసం చేశాయి. రెండు రోజుల క్రితం ఏనుగుల దాడికి రెండు ఆవులు మృతి చెందాయని గ్రామస్థులు అంటున్నారు.
బాబోయ్ ఏనుగులు.. మన్యం జిల్లాలో బెంబేలెత్తుతున్న ప్రజలు - అరటి
Elephants Attack: పార్వతిపురం మన్యం జిల్లా మిర్తివలస గ్రామంలోని ప్రజలకు ఏనుగుల గుంపు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏనుగుల గుంపు గ్రామంలోకి రావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Etv Bharat
Last Updated : Oct 27, 2022, 3:54 PM IST