ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యం జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు.. పాలకొండలోనే 80 డెంగీ కేసులు - విజయనగరం

Dengue Fever: మన్యం జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. జిల్లాలో గతకొద్ది రోజులుగా నమోదవుతున్న కేసుల సంఖ్యను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులే కాకుండా, పారిశుద్థ్యం లేకపోవటం కూడా ఇవి ప్రబలడానికి కారణమవుతున్నాయని పాలకొండ నగరవాసులు అంటున్నారు.

వణికిస్తున్న విష జ్వరాలు
వణికిస్తున్న విష జ్వరాలు

By

Published : Sep 20, 2022, 7:56 PM IST

మన్యం జిల్లాను వణికిస్తున్న విష జ్వరాలు.. పాలకొండలోనే 80 డెంగీ కేసులు

Viral Fever In Parvatipuram District: పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. పాలకొండలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉండటం.. ఆందోళనను రెట్టింపు చేస్తోంది. జిల్లాలో నమోదైన 160 డెంగ్యూ కేసుల్లో పాలకొండలోనే 80 కేసులు ఉండటం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ 160 కేసులు అధికారికంగా నమోదైనవి మాత్రమే.. ఇవే కాకుండా చాలా మంది శ్రీకాకుళం, విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడంతో బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. గడిచిన రెండు నెలల్లో పాలకొండలో కేసుల సంఖ్యలో పెరుగుదలను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారులకు జ్వరం వస్తే చాలు.. డెంగ్యూ కావచ్చుననే అనుమానంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. భరించలేని భారమే అయినా.. ప్రాణాల్ని కాపాడుకునేందుకు శ్రీకాకుళం, విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు.

పాలకొండ నగర పంచాయతీ పరిధిలో ఎస్​కే రాజపురం, ఇందిరానగర్ కాలనీ, కోటదుర్గమ్మ ఆలయ సమీప ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. పాలకొండలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్లే డెంగ్యూ విజృంభిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ ఆధ్వానంగా ఉండటంతో పాటు ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరడం, పిచ్చి మొక్కలు పెరగడం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని.. పట్టణ వాసులు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా160కి పైగా డెంగ్యూ కేసులు నమోదుకావడంతో.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటా సర్వే చేపట్టినట్లు వైద్యాధికారులు తెలిపారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి మందులు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details