Crackers Blast In Police Station: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో టపాసులు పేలి అగ్ని ప్రమాదం జరిగింది. పలు కేసుల్లో సీజ్ చేసిన టపాసులను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచిన క్రాకర్స్ పేలి ప్రమాదం జరిగింది. వీటి విలువ దాదాపు 3 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాపిడి సంభవించి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. సీజ్ చేసిన పేలుడు సామగ్రి పోలీస్ స్టేషన్‌లో ఉంచటం పై విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావటంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇలా జరుగుతుందని ఊహించక.. సీజ్ చేసిన టపాసులను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.. చివరికి - Andhra Pradesh Latest News
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పోలీస్ స్టేషన్‌లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని సిబ్బంది ఊహించి ఉండరు. పోలీసులు పలు కేసుల్లో సీజ్ చేసిన టపాసులను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. సీజ్ చేసిన వీటి విలువ మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. కానీ చివరికి వారు ఊహించని సంఘటన జరిగింది.. ఏమైందంటే..
![ఇలా జరుగుతుందని ఊహించక.. సీజ్ చేసిన టపాసులను పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.. చివరికి Saluru Police Station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16336961-740-16336961-1662819014570.jpg)
సాలూరు పోలీస్ స్టేషన్