Theft Gold Chain In Parvathipuram : కంట్లో కారం కొట్టి మెడలో బంగారు గొలుసును దొంగిలించిన ఘటన పార్వతీపురం పట్టణంలో చోటు చేసుకుంది. ముద్దు వారి వీధిలో నివాసం ఉంటున్న కామేశ్వరి భర్త పురోహితుడు. ఆయన ఊరు వెళ్లడం గమనించిన ఓ గర్భిణీ.. ఇంటికి వచ్చింది. తన జాతకచక్రం ఇస్తామన్నారని.. ఫోన్లో మాట్లాడినట్లు పురోహితుడి భార్యకు చెప్పింది. పురోహితుడి భార్య కామేశ్వరి ఇంట్లోకి వెళ్లి జాతకానికి సంబంధించిన పత్రం వెతుకుతుండగా.. ఆమె కంట్లో కారం కొట్టి మెడలో బంగారు గొలుసు, రూ.3వేలతో ఉడాయించింది. బాధితురాలు కేకలు వేయడంతో.. చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
కంట్లో కారం కొట్టి.. బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన మహిళ - మెడలో తులమున్నర నగను దొంగలించారు
Theft Gold Chain In Parvathipuram : కంట్లో కారం కొట్టి మెడలో నగను దొంగలించిన ఘటన పార్వతీపురం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
KANTILO