MLA Alajangi Jogarao: 'గడప గడపకి మన ప్రభుత్వం' కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు నిరసన సెగ తగిలింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చలంనాయుడువలస గ్రామానికి చెందిన సర్పంచ్ వర్గం వైకాపా నాయకులు, గ్రామస్థులు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. గ్రామం శివారులో ఎమ్మెల్యే జోగారావును అడ్డుకుని 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదంటూ నిలదీశారు. ఎమ్మెల్యే అనుకూల వర్గం-వ్యతిరేక వర్గాల మధ్య కొంత సమయం పాటు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది.
అర్హులకు సంక్షేమ పథకాలేవి? ఎమ్మెల్యే జోగారావును అడ్డుకున్న సొంత పార్టీ నేతలు - పార్వతీపురం మన్యం జిల్లా తాజా వార్తలు
MLA Alajangi Jogarao: పార్వతీపురం వైకాపా ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు..సొంతపార్టీ నుంచే నిరసన సెగ తగిలింది. 'గడప గడవకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెలంనాయుడువలసకు ఎమ్మెల్యే బయల్దేరారు. వైకాపాలోని సర్పంచ్ వర్గం ఆయన్న ఊళ్లోకి రానివ్వకుండా పొలిమేరల్లోనే నిలిపివేసింది. అర్హులకు సక్రమంగా పథకాలు అందట్లేదని ఆందోళనకు దిగింది. 'ఎమ్మెల్యే గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు.
![అర్హులకు సంక్షేమ పథకాలేవి? ఎమ్మెల్యే జోగారావును అడ్డుకున్న సొంత పార్టీ నేతలు MLA Alajangi Jogarao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15370336-1019-15370336-1653378256075.jpg)
ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు నిరసన సెగ
ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు నిరసన సెగ
TAGGED:
ఎమ్మెల్యేకి నిరసన సెగ