ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్​వాడీలోని కోడిగుడ్లు.. స్థానిక దుకాణాలలో ప్రత్యక్షం - parvathipuram manyam

Anganwadi Eggs: ప్రభుత్వాలు పౌష్టికాహారలోప నియంత్రణ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలను రూపోందిస్తున్నాయి. కానీ, ఈ కార్యక్రమాలు ఏదో ఒక రూపంలో పెడదారులలో వెళ్తూనే ఉన్నాయి. దీనికే ఉదాహరణే పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్​వాడీ కెేంద్రాలలో అందించే కోడిగుడ్లు దుకాణాలలో కనిపించటం.

Anganwadi Eggs
అంగన్​వాడీ కోడిగుడ్లు

By

Published : Nov 11, 2022, 9:26 PM IST

Anganwadi Eggs: పౌష్టికాహారం రూపంలో అంగన్​వాడీలో పిల్లలు, గర్భిణీలకు అందాల్సిన కోడిగుడ్లు అంగట్లో సరకులుగా మారాయి. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అంగన్​వాడీల ద్వారా అందించే కోడిగుడ్లు స్థానిక దుకాణాల్లో ప్రత్యక్షమయ్యాయి. అంగన్​వాడీలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు కొంతమేర దారి మళ్లీ.. ఇలా దుకాణాల్లో దర్శనమిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పలు గ్రామాల్లోని అంగన్​వాడీ సిబ్బంది డబ్బులకు ఇలా దుకాణాలకు అమ్ముతున్నారని చర్చించుకుంటున్నారు. దీనిపై గుమ్మలక్ష్మీపురం అంగన్​వాడీ అధికారులను వివరణ కోరగా.. వారి పరిధిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల సెక్టర్లు ఉన్నాయని తెలిపారు. అయితే దుకాణాల్లో కనిపించిన కోడిగుడ్లు ఏ సెక్టార్​కి చెందినవో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అంగన్​వాడీ కోడిగుడ్లు దుకాణాలలో ప్రత్యక్షం.

ABOUT THE AUTHOR

...view details