ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు వైద్యం వికటించి.. 8 నెలల బాలుడికి అస్వస్థత! - పార్వతీపురం జిల్లాలో నాటు వైద్యం వికటించి చిన్నారి అస్వస్థత

గిరిజన గ్రామాల ప్రజలు ఇప్పటికీ.. నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నాటు వైద్యం వికటించి ఎనిమిది నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.

8 month old boy Illness with Naatu Vaidyam
నాటు వైద్యం వికటించి 8 నెలల బాలుడికి అస్వస్థత

By

Published : May 30, 2022, 6:11 PM IST

పొట్టపై చురకలు వేయడమనే నాటు వైద్యం వికటించి.. ఎనిమిది నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని మక్కువ మండలం ఆలుగూడ గ్రామానికి చెందిన చిన్నారికి వారం రోజుల క్రితం కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆ బాబు తల్లిదండ్రులు.. నాటువైద్యుడిని ఆశ్రయించారు. కడుపులో బల్ల ఉందని చెప్పిన ఆ వైద్యుడు.. దాన్ని కరిగించేందుకు పొట్టపై వాతలు వేశాడు అని బాబు తల్లి చెప్పింది. అయితే.. తాజాగా పొట్టపైన ఆ భాగం పుండుగా మారడంతో బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

గిరిజన గ్రామాల ప్రజలు.. నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆస్పత్రి వైద్యాధికారిని వాగ్దేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇంకా నాటు వైద్యం చేయించడం సరికాదని ఆమె సూచిస్తున్నారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా.. వైద్యులను సంప్రదించాలని గిరిజనులకు డాక్టర్​ సూచించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details