ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం - AP main news

Violence against minor girl: పార్వతీపురం మన్యం జిల్లాలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. మైనర్ బాలికపై 49 ఏళ్ల వ్యక్తి బలత్కారానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులు గుర్తించి వీరఘట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Violence against minor girl
పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Jan 2, 2023, 8:54 PM IST

Violence against a minor girl: మైనర్ బాలికపై అఘాయిత్యం పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి బలత్కారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో తాత వరుసైన 49 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా బాలిక ఉండిపోయింది. ఆదివారం ఉదయం కుమార్తె పరిస్థితి గమనించిన తల్లి ఘటనపై ఆరా తీసింది. భయపడిపోయిన బాలిక విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వీరఘట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్స నిమిత్తం పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం దిశ డిఎస్పీతో పాటు డీఎస్పీ జీవీ కృష్ణారావు పాలకొండ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details