Young Man Won National Award for Painting : వేల మాటల్లో చెప్పలేని భావాన్ని మనసుకు హత్తుకునే ఒకే ఒక్క చిత్రంతో చెప్పచ్చు. రంగుల కళైన చిత్రకళ గొప్పతనమది. అలాంటి చిత్రకళలో ఎలాంటి శిక్షణ లేకపోయినాతనకంటూ ప్రత్యేక గుర్తింపుతో రాణిస్తున్నాడీ యువకుడు. సాధనే పెట్టుబడిగా చక్కటి చిత్రాలకు ప్రాణం పోస్తున్నాడు. తన ప్రతిభతో ప్రముఖులను సైతం మెప్పిస్తూ సరికొత్తగా సాగిపోతున్నాడు ఈ యువ కళాకారుడు.
ఈ కళాకారుడి పేరు వల్లెం కృష్ణ. స్వస్థలం వినుకొండ మండలంలోని కొత్త గోకనకొండ గ్రామం. మారుమూల పల్లెలో పుట్టిన పెరిగి పేదరికం కారణంగా ఏడో తరగతితో చదువు మానేశాడు. కాని, పాఠశాల దశ నుంచే బొమ్మలు వేయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. కుటుంబ పోషణ కోసం తండ్రితో కలిసి కూలీ పనులకు వెళ్లాడు. అలా దొరికిన పని చేస్తూ చివరకు బేల్దారి మేస్త్రిగా స్థిరపడ్డాడు కృష్ణ.
చిత్ర, శిల్పకళలపై ఆసక్తితో అబ్బురపరిచే చిత్రాలు - రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు
బతుకుదెరువు కోసం బేల్దారి పని చేస్తూనే, అవకాశం ఉన్నప్పుడల్లా చిత్రాలు వేస్తూ కళాకారుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. చిత్రకళకు అవసరమైన రంగులు, కుంచెలు, కాన్వాస్ అందుబాటులో లేకపోయినా వేప పుల్లలు, అగ్గిపుల్లలతో చిత్రాలు వేయడం సాధన చేశాను. ఇలా నిరంతర కృషితో మంచి నైపుణ్యం సాధించాను. - వల్లెం కృష్ణ, చిత్రకారుడు
Young Man Showing his Ability in Painting : ఆర్ధిక ఇబ్బందుల్ని తట్టుకుని నిలబడేందుకు, తనలోని ప్రతిభను చాటుకునేందుకు శిల్పకళ వైపు దృష్టి సారించాడు ఈ కళాకారుడు. కొంతకాలం గుంటూరులో ఉంటూ శిల్పకళలో మెళకువలు నేర్చుకున్నాడు. అనంతరం గ్రామంలోనే శిల్పాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. మనిషిని చూసి లేదా ఫొటో చూసి పోర్ట్‌రైట్స్ చిత్రాలు వేయడంలో నైపుణ్యం సంపాదించాడు. పరిసర గ్రామాల వారికి పలు పోర్ట్‌రైట్స్ బొమ్మలు రూపొందించి ఇవ్వడం ద్వారా కళాకారుడిగా అందరి మన్ననలందుకున్నాడు.
కుటుంబ ఆర్ధిక పరిస్థితుల వల్ల కొంతకాలం చిత్రకళకు దూరమైన కృష్ణ వినుకొండకు చెందిన సీనియర్ చిత్రకారుడు జస్టిస్ ప్రోత్సాహం, సూచనలతో తిరిగి చిత్రలేఖనం వైపు దృష్టి సారించాడు. జస్టిస్‌ను గురువుగా భావించి చిత్రకళలో మరిన్ని మెళకువలు నేర్చుకున్నాడు. చిత్రకళ పోటీల్లోనూ పాల్గొనడం ప్రారంభించాడు. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా బహుమతులు అందుకున్నాడు. ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితుల్లో ఉన్నా కుటుంబసభ్యుల సహకారంతో చిత్రకళలో సత్తా చాటుతున్నాడు.
Young Boy 3D Art with Technology: శిల్పకళకు సాంకేతిక త్రీడీ హంగులు.. జీవం ఉట్టిపడుతున్న విగ్రహాలు
సాధించాలనే సంకల్పంతో నచ్చిన పనిలో సాధన చేస్తే ఫలితం తప్పక వస్తుందని నిరూపిస్తున్నాడు కృష్ణ. పెద్దగా చదువుకోకపోయినా, పేదరికం పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నా తనదైన ప్రతిభతో చిత్రకళలో రాణిస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, సహకారం లభిస్తే కళాకారుడిగా రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.
వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం