YCP leaders fight in school: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిపాడులోని ప్రభుత్వ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకల్లో విద్యార్థుల ఎదుట వైసీపీ నేతలు కొట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవానికి వైస్ ఎంపీపీ అలుగుమల్లి సంజీవరెడ్డి, గ్రామానికి చెందిన వైసీపీ నేత దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బహుమతి ప్రదానోత్సవ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
రిపబ్లిక్ డే వేడుకలో వైసీపీ నేతల కుమ్ములాట.. వీడియో వైరల్ - fight at school
YCP leaders fight in school: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిపాడులోని ప్రభుత్వ పాఠశాల రిపబ్లిక్ డే వేడుకల్లో విద్యార్థుల ఎదుటే వైసీపీ నేతలు కొట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవానికి వైస్ ఎంపీపీ అలుగుమల్లి సంజీవరెడ్డి, గ్రామానికి చెందిన వైసీపీ నేత దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. బహుమతి ప్రదానోత్సవ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
రిపబ్లిక్ డే వేడుకలో.. వైసీపీ నేతల కుమ్ములాట
పాఠశాల ఆవరణలో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. విద్యార్థుల ముందే ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో విద్యార్థులు కేకలు వేస్తూ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని పరిస్థితిని అదుపు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇవీ చదవండి: