YCP Leaders Attacked TDP Leaders: రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వీరు మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ వర్గీయులు, టీడీపీ మద్దతుదారుల పరస్పర దాడులతో పల్నాడు జిల్లాలో మళ్లీ రక్తం చిందింది. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో సత్తెమ్మ తల్లి కొలుపుల్లో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. సుమారు గంట సేపు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతకు తీవ్ర గాయం కావడంతో టీడీపీ మద్దతుదారుల ఇళ్లపై అధికార పార్టీ వారు విచక్షణా రహితంగా దాడులు చేశారు.
YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!
Disagreements between ruling and opposition parties:పల్నాడులో మరోమారు అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో సత్తెమ్మ కొలుపులు జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. టీడీపీ మద్దతుదారులు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఊరేగింపుగా వెళ్లుతూ చల్లిన కుంకుమ.. వైసీపీ వర్గీయులపై పడింది. దీంతో గొడవ మొదలై ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో వైసీపీ నేత రవీంద్రకు గాయాలయ్యాయి. దీంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు కర్రలు, మారణాయుధాలతో టీడీపీ మద్దతుదారుల నివాసాలపై దాడులుచేశారు. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇరు వర్గాలు కర్రలు, మరణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో టీడీపీ, వైసీపీ వర్గీయులు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు... రాళ్లు, కర్రలు, కత్తులు, సీసాలతో టీడీపీ మద్దతుదారుల ఇళ్లపై దాడి చేయడంతో గృహాలు ధ్వంసమయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళలు ఇంట్లో నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. అక్కడ గంటకు పైగా ఈ దాడులు కొనసాగాయి.