YCP Leaders Attacked Businessman: వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు తీసుకుని వచ్చింది లేకపోగా.. ఉన్న వాటిని కూడా భయపెడుతున్నారు. అడిగినంత కమీషన్ ఇవ్వాలని.. లేకుండా లాభాల్లో వాటాలు ఇవ్వాలంటూ హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. దాడులకు సైతం పాల్పడుతున్నారు. ప్రతి నెలా కమీషన్ ఇవ్వాలంటూ.. కాదని ముందుకెళ్తే ఖబడ్దార్ అంటూ ఓ ప్రవాస పారిశ్రామికవేత్తపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పంచాయతీ పరిధిలో కంపెనీ నడపాలంటే ప్రతినెలా కప్పం కట్టాలి.. మమ్మల్ని కాదని ముందుకెళ్తే నీ సంగతి చూస్తాం.. కంపెనీ మూసేసినా గత లాభాల్లో వాటాలు పంచాలి.. లేదంటే ఖబడ్దార్ అంటూ వైసీపీ నేత ఒకరు తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన.. పల్నాడు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయంలో స్థానిక వాలంటీర్ కూడా కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. దీనిపై బాధితుడు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
YSRCP Leader Attack on ST Womens: చేయని దొంగతనం ఒప్పుకోవాలని.. ఎస్టీ మహిళలపై వైసీపీ నాయకుడు విచక్షణారహితంగా దాడి
అసలు ఏం జరిగిందంటే.. బాధితుడు పిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుకు చెందిన నాతాని వెంకట్రావు అనే ప్రవాసాంధ్రుడు.. అమెరికాలో ఉద్యోగం వదిలేసి భారత దేశంపై మమకారంతో.. సొంత జిల్లాలో సిమెంట్ స్తంభాల తయారీ యూనిట్లు నాలుగు నెలకొల్పారు. తన సంస్థల్లో సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో ఒక యూనిట్‌ను నరసరావుపేట మండలం బసికాపురం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేశారు.
ప్రతి నెలా కప్పం చెల్లించాల్సిందే:ఇది తమ పంచాయతీ పరిధిలో ఉన్నందున ప్రతి నెలా తనకు కప్పం చెల్లించాలని.. వెంకట్రావును ఉపసర్పంచి, వైసీపీ నేత వంపుగుడి రాజేశ్ డిమాండ్ చేశారు. ఇందుకు వెంకట్రావు నిరాకరించడంతో.. తన అనుచరులతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. సామగ్రితో వస్తున్న లారీలను పరిశ్రమలోకి వెళ్లకుండా పలుమార్లు అడ్డగించారు. ఈ నెల 23వ తేదీన గ్రామ వాలంటీరు అక్షయ్, రైల్వే ఉద్యోగి చిన్నయ్య, మరో 50 మంది కలిసి.. ముసుగులు ధరించి కంపెనీలోకి ప్రవేశించి రాళ్లు విసిరారు. అడ్డుకున్న వారిని కొట్టారు.
YCP Leaders Attack on SCs in Annamayya District: అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఎస్సీలపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి
కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి.. అంతు చూస్తామని హెచ్చరించి: వెంకట్రావును దుర్భాషలాడి దాడి చేశారు. అంతే కాకుండా ఆయన్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా.. కార్మికులు ప్రతిఘటించడంతో వదిలేశారు. నీ అంతు చూస్తామని హెచ్చరిస్తూ వెళ్లిపోయారని.. వెంకట్రావు తెలిపారు. దీంతో తనకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్య తీసుకోవాలంటూ వెంకట్రావు నరసరావుపేట గ్రామీణ పోలీసులకు బుధవారం రోజున ఫిర్యాదు చేశారు. దీనిపై గ్రామీణ ఎస్సై బాలనాగిరెడ్డిని వివరణ కోరగా.. ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
YCP Followers attacked TDP workers: నిమజ్జనం కోసం వెళ్తూ... రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. తిప్పికొట్టిన టీడీపీ కార్యకర్తలు...