'మా భూమిని అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు... న్యాయం చేయండి' - తమ భూమిని వైకాపా నేతలు కబ్జా చేశారని స్పందన కార్యక్రమంలో మాచర్ల దళిత మహిళలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు
Complaint on YSRCP leader: తమ భూమిని అధికారపార్టీ నేతలు కబ్జా చేశారంటూ మాచర్లకు చెందిన దళితులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని... న్యాయం చేయాలని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ను వేడుకున్నారు.
భూమిని కబ్జా చేశారని మహిళలో ఆవేదన
Land issue in Macherla: అధికార పార్టీ నేతలు తమ భూమిని కబ్జా చేసి తిరిగి మాపైనే దాడులు చేస్తున్నారని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ శివశంకర్‌కు ఫిర్యాదు చేశారు. మాచర్ల పట్టణం శ్రీశైలం రోడ్డులోని 88 సెంట్ల భూమిని అధికార పార్టీ వ్యక్తులు కబ్జా చేసి గోడ కట్టారని వాపోయారు. మాచర్ల పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత మహిళలు ఆరోపించారు.