పల్నాడు జిల్లా మాచర్లలోని సెబ్ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. నాటుసారా తయారీ కేసులో రాజు అనే వ్యక్తిని సెబ్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. అతని కోసం భార్య జ్యోతి చంటిబిడ్డతో స్టేషన్ వద్దకు వచ్చింది. రాజును అన్యాయంగా అరెస్టు చేశారని.. కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజును విడుదల చేయాలని కోరారు.
ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి.. కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం - Women attack on Macharla SEB office
పల్నాడు జిల్లా మాచర్ల ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి చేశారు. నాటుసారా కేసులో రాజు అనే వ్యక్తిని ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని అక్రమంగా అరెస్టు చేశారని కార్యాలయంపై రాజు కుటుంబీకులు దాడి చేశారు.
ఎస్ఈబీ కార్యాలయంపై మహిళలు దాడి
పోలీసులు పట్టించుకోకపోవటంతో అక్కడ ఉన్న కుర్చీలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలు కిందపడేశారు. రాజును పీడీ యాక్ట్ కింద అరెస్టు చేశామని సెబ్ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:జానీ డెప్-అంబర్ హెర్డ్.. ప్రేమ కథ నుంచి కోర్టు దాకా.. వయా ఎలాన్ మస్క్!