Waqf Board Lands Case: 18 ఏళ్లుగా అనేక కష్టాలు అనుభవిస్తూ జీవిస్తున్న గుడిసెల్లో దీపాలు ఆర్పకండి అంటూ పల్నాడు జిల్లా వినుకొండలోని ఆజాద్ నగర్ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వక్ఫ్ బోర్డు భూముల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇటీవల ప్రభుత్వ అధికారులు ఆజాద్ నగర్‌ను సందర్శించి అక్కడ నివాసం ఉంటున్న పేదలకు హుకుం జారీ చేసి హెచ్చరిక బోర్డులు పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుఆజాద్ నగర్ పేదలపై కక్ష కట్టినట్లుగా మాట్లాడటం.. అక్కడ నివాసం ఉంటున్న వారు చీకటి వ్యాపారం చేస్తున్నారంటూ అసభ్యకరమైన పదాలను ఎమ్మెల్యే హోదాని మరిచి విచక్షణ లేకుండా మాట్లాడటంపై బాధిత పేద ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
అకస్మాత్తుగా భర్త మృతి.. ఇంట్లోనే దహనం చేసిన భార్య..
సీపీఐ భూ పోరాటంలో భాగంగా సుమారు 5వేల మందికి పైగా పేదలు మసీదు మాన్యం భూముల్లో గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. నాడు ముజావర్లు మసీదు మాన్యం భూములను అమ్ముకోవటం.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి చూసి రియల్టర్లు, భూ భకాసురుల చేతుల్లోకి వెళ్తున్న మసీదు మాన్యం భూములను సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేదలపై కక్ష కట్టి నీరు, కరెంటు నిలిపివేసి పేదల గుడిసెల్లో దీపం ఆపేందుకు.. ఆయన అనుకున్న వారికి అప్పగించేందుకు దౌర్జన్యం చేస్తున్నాడని వాపోతున్నారు. అంతేకాకుండా పేదల పట్ల చులకనగా వ్యవహరిస్తూ అసభ్యకరంగా మాట్లాడటం దుర్మార్గం అని వాపోతున్నారు.