Road accident: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వద్ధినేని వారిపాలెం నుంచి ట్రాలీ వాహనంలో 17 మంది పెళ్లిచూపుల కోసం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొలకలూరు గ్రామానికి వచ్చారు. పెళ్లిచూపుల తర్వాత బుధవారం అర్ధరాత్రి తిరిగి గ్రామానికి బయల్దేరారు. అయితే తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ట్రాలీని.. గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వస్తున్న కంటైనర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. అక్కడికక్కడే ట్రాలీ వాహనంలో ప్రయాణిస్తున్న ఈదర రమణయ్య (55), ఈదర మాల్యాద్రి(45) మరణించారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిలకలూరిపేట ప్రభుత్వాస్పపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాలీని ఢీకొట్టిన కంటైనర్..అక్కడికక్కడే ఇద్దరు మృతి - పల్నాడు జిల్లా నేర వార్తలు
Road accident: పెళ్లిచూపుల కోసం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు.. రోడ్డుపక్కన వాహనాన్ని నిలిపి.. మళ్లీ బయల్దేరారు.. కానీ ఓ కంటైనర్ వారికి మృత్యువాహనంలా మారింది... వేగంగా వచ్చి ట్రాలీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
రోడ్డు ప్రమాదం