Tripurapuram Hill Illegal Excavations: మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. వారి ఆక్రమాలకు కొండలే కరిగిపోతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ దందాతో అధికారపార్టీ నేతలు కోట్ల రూపాయలను మూట గట్టుకున్నారు. వైసీపీ ముఖ్యనాయకులు అండదండలతో వీరి అక్రమాలకు అడ్డు అనేదే లేకుండా పోయింది. అక్రమ మట్టి తవ్వకాలతో పచ్చగా ఉండాల్సిన పల్నాడు జిల్లా త్రిపురాపురం కొండ గుండు కొట్టినట్లుగా కనిపిస్తోంది. గతంలో ఎంతో హరితంగా, ఆహ్లదకరంగా ఉండే కొండ నేడు తవ్వకాలతో బోసిపోయింది. ఇదే విధంగా ఆక్రమాలు కొనసాగితే కొండ కనిపించకుండాపోయినా ఆశ్చర్యం అవసరం లేదని స్థానికులు వాపోతున్నారు.
Red Soil ఎర్రమట్టి వనరులు అధికం: నకరికల్లు మండలంలోని త్రిపురాపురం పరిధిలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి సమీపంలో త్రిపురాపురం కొండ ఉంది. ఈ కొండపై నాణ్యమైన ఎర్ర మట్టి వనరులు అధికంగా కలవు. అయితే తొలుత అధికారుల అనుమతులు తీసుకున్న వైసీపీ నాయకులు.. కొండ కిందిభాగంలో కొంత తవ్వకాలు చేపట్టారు. అనుమతులు పూరైన తర్వాత కూాడ వారి తవ్వకాలు ఆగలేదు.
గోదావరి తీరంలో ఇసుక తోడేళ్లు - గడువు పూర్తైనా యథేచ్ఛగా ఇసుక దందా
అక్రమార్జనకు అలవాటై మూడు సంవత్సరాలుగా తవ్వకాలు: అనుమతుల వంటివి లేకపోవడంతో పన్నులు, రాయల్టీ వంటివి చెల్లించనవసరం లేకపోవడంతో అక్రమార్జన గావించారు. ఇదే అదనుగా భావించి గత మూడు సంవత్సరాలుగా కొండపై తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వెంచర్లకు, లోతట్టు ప్రాంతాల మెరకకు ఇక్కడి మట్టిని తరలిస్తున్నారు. ఈ విధంగా నిత్యం టిప్పర్లతో రసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి ప్రాంతాలకు మట్టి అక్రమ రవాణా సాగుతూనే ఉంది.