Theft: పల్నాడుజిల్లా నరసరావుపేటలో రెండు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పాతూరులోని శ్రీ విజయ చాముండేశ్వరి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. గత ఆరేళ్లుగా హుండీలో నిల్వ ఉన్న నగదు మాయమైందని ఆలయ అర్చకుడు తెలిపారు. పాతూరు శివాలయం గేటు ప్రధాన తాళం పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు. ఘటనపై పోలీసులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీలో మొత్తం రూ.80 వేలు పోయాయని చాముందేశ్వరి ఆలయ అర్చకుడు తెలిపారు.
దేవుడి గుడినే దోచేశారు.. హుండీ పగలగొట్టి.. - పల్నాడు జిల్లాలో చోరీ
Theft: నరసరావుపేటలో దొంగలు హాల్చల్ చేశారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి హుండీ పగులగొట్టి నగదు చోరీ చేశారు. మరో ఆలయంలో తాళాలు పగలగొట్టి చోరీకి యత్నించారు. ఆలయ సిబ్బంది నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నరసరావుపేటలో దొంగల హాల్చల్