Farmer suicide: అప్పుల బాధలు భరించలేక కౌలు రైతు వేంపాటి శ్రీనివాసరెడ్డి (35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా కారంపూడ మండలం చిన్నగార్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గ్రామ శివారులోని సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ విషాద ఘటనకు పూనుకున్నాడు. మృతదేహాన్ని గమనించిన రైతులు.. పోలీసులకు సమాచారం అందించారు. శుక్ర, శనివారాల్లో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, అధిక వర్షాల కారణంగా తాము పొలాల వైపు రాలేక గుర్తించలేకపోయామని రైతులు తెలిపారు.
అప్పులు తీర్చలేక.. ఏం చేయాలో దిక్కుతోచక
Farmers suicide: అప్పుల బాధలు ఓ కౌలు రైతు ప్రాణాలు తీశాయి. పంటలు పండి తన కష్టాలు తీరుతాయన్న ఆశతో సాగు చేసిన రైతుకు అప్పులే మిగిలాయి. అవి తీర్చే స్థోమత లేక.. ఏం చేయాలో దిక్కుతోచక తన ప్రాణాలనే తీసుకున్నాడు. ఇంట్లో ఊరికి వెళ్తున్నానని చెప్పి.. ఈ లోకం నుంచే వెళ్లిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీనివాస్ రెడ్డి స్వస్థలం చిన్నగార్లపాడు కాగా.. పదేళ్ల క్రితం వ్యవసాయంతో అప్పులు కావడంతో ఉన్న పొలం అమ్మి అప్పులు తీర్చాడు. తర్వాత అమ్మమ్మగారి ఊరు తాడికొండ మండలం పోనేకల్లుకు వలస వెళ్ళాడు. అక్కడే పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా.. అక్కడా అప్పులు అధికమయ్యాయి. దాంతో బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో చిన్నగార్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాలకు తరలించారు.
ఇదీ చదవండి: