Farmer Suicide: అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని రాయవరంలో జరిగింది. మల్లికార్జున రావు అనే రైతు 3ఎకరాల సొంత పొలంతోపాటు.. ఒకటిన్నర ఎకరం కౌలుకు తీసుకుని పంట వేశారు. పంట చేతికి రాకపోవడంతో10 లక్షల రూపాయల వరకు అప్పు లపాలయ్యారు. నాలుగేళ్లుగా అప్పులు పెరగడంతో తట్టుకోలేక.. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రైతు మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మాచర్లలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య - మాచర్లలోని రాయవరంలో కౌలు రైతు ఆత్మహత్య
Farmer Suicide: పల్నాడు జిల్లా మాచర్లలోని రాయవరంలో విషాదం చోటు చేసుకుంది. సొంత పొలానికి తోడు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకున్న రైతు.. రూ. 10 లక్షల అప్పు చేశాడు. ఇప్పుడు పంట చేతికి రాకపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న మాచర్ల కౌలు రైతు