TDP Leader GV Anjaneyulu Fire on YSRCP MLA Bolla Brahmanaidu: పల్నాడు జిల్లా వినుకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. బొల్లా బ్రహ్మనాయుడు రాష్ట్రంలోనే అతిపెద్ద భూ బకాసురుడుగా తయారయ్యాడని.. ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపించినా కబ్జాలు చేసేస్తున్నాడని ఆరోపించారు.
ఆరోజు అడ్డుపడ్డాడు-నేడు కబ్జా చేశాడు..పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న భూ కబ్జాలపై టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు..తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులను బెదిరించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు భారీగా ముడుపులు గుంజుతున్నారన్నారు. ముడుపులు ఇవ్వకపోతే అక్రమ అనుమతులతో వ్యాపారాలు చేస్తున్నారని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక మార్కాపురం రోడ్డులోని జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, గతంలో కొందరు వెంచర్ వేస్తే ఎమ్మెల్యే బొల్లా ఆపించి.. అడ్డుకోవడమే కాక, ఇలాంటి భూ అక్రమంలో వాస్తవాలు రాయరా..? అంటూ మీడియాపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు.
'తక్కువ అంచనా వేయొద్దు.. సమయం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా'
పత్రికలను దూషించటం దుర్మార్గం.. ఆరోజు అడ్డుపడిన అతను..ఈరోజు అదే భూమిలో అనధికారిక అక్రమ వెంచర్‌కు భూమి పూజ చేసి, అక్రమాలను వెలుగెత్తి చూపిన పత్రికలపై దూషణలకు పాల్పడడం దుర్మార్గమని..జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అదే ఏరియాలో ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూమిలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, ప్రభుత్వం కల్పించిన చుక్కల భూముల రెగ్యులేషన్ అవకాశాన్ని అతని వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకొని.. వందల ఎకరాలు అక్రమంగా దోచుకున్నాడని ఆయన ఆరోపించారు.
GV. ANJANEYULU: వైకాపా ప్రభుత్వం వేల కోట్ల దోపిడీకి పాల్పడింది: జీవీ ఆంజనేయులు
ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలి.. ''విఠంరాజుపల్లి వద్ద చౌకబారుగా భూములు కొన్న ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అనధికారికంగా రోడ్డు వేశాడు. ఆ తర్వాత గిరిజన బాలుర హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, అతని భూమికి వాల్యూ పెంచుకున్నాడు. నాడు ఘాట్ రోడ్డుకు ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వని బ్రహ్మనాయుడు.. కొండ చుట్టున్న భూములను తక్కువ ధరకే కొట్టేసి, రామలింగేశ్వర స్వామి కల్లోకి వచ్చాడంటూ ఘాట్ రోడ్డు నిర్మాణంతో ప్రజలను మోసం చేస్తున్నాడు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను ఎకరానికి రూ.18 లక్షలు చొప్పున అమ్మేసి రూ.18 కోట్లు కాచేసిన కేటుగాడు ఎమ్మెల్యే బొల్లా. ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి..నిగ్గుతేల్చాలి.-జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే.
"రాష్ట్రంలో ఏరులైపారుతున్న.. మద్యం కల్తీ బ్రాండ్లు"