ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉంగుటూరులో ఉద్రిక్తత.. రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన - రైతు ఆత్మహత్య తాజా వార్తలు

Farmer Suicide: చెరువు నీళ్ల మళ్లింపు వివాదంలో రైతు ఆత్మహత్య చేసుకోవటంతో పల్నాడు జిల్లా ఉంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది. రైతు నందకిశోర్ మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు రహదారిపై తెదేపా నేతలు ఆందోళనకు దిగారు.

రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన
రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన

By

Published : Aug 9, 2022, 4:31 PM IST

TDP Protest For Farmer Suicide: పల్నాడు జిల్లా ఉంగుటూరులో ఉద్రిక్తత నెలకొంది. చెరువు నీళ్ల మళ్లింపు వివాదంలో ఆత్మహత్య చేసుకున్న రైతు నందకిశోర్ అంత్యక్రియల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వస్తున్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, ఇతర నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జీజీహెచ్​ నుంచి మృతదేహాన్ని ఉంగటూరుకు తీసుకొస్తుండగా.. అంబులెన్స్‌ను తెదేపా నేతలు మధ్యలో అడ్డుకున్నారు. రైతు మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రైతు ఆత్మహత్యపై తెదేపా ఆందోళన

ABOUT THE AUTHOR

...view details