EX minister PullaRao: నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభం అనగానే వైసీపీ నేతల గుండెల్లో దడ మొదలైందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇంట్లో శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రతో జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని, పాదయాత్ర ప్రకటించగానే జగన్కు ముందస్తు ఆలోచన మొదలైంది అన్నారు. జగన్ వై నాట్ 175 డైలాగు జీరో అయ్యేటట్లు కనపడటంతో ఆందోళనలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం లోకేష్ వెంట పరుగెత్తడానికి సిద్ధంగా ఉందన్నారు.
జగన్ చేతిలో మోసపోయిన యువత, మహిళలు, రైతుల ప్రధాన కాన్సెప్ట్ గా లోకేష్ పాదయాత్ర ఉంటుందన్నారు. లోకేష్ పాదయాత్ర మొదలైతే వైసీపీలోని చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేయకుండా తప్పుకుందామని ఆలోచనకు వస్తున్నారన్నారు. జగన్ను నమ్ముకుంటే మునిగిపోతామని వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో అంతర్ మదనం మొదలైందని.. వైసీపీలోని ద్వితీయ, తృతీయ స్థాయి నాయకుల లోనూ ఆందోళన నెలకొంది అన్నారు.