ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chandrababu: చంద్రబాబుపై దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన - AP Latest News

Nara Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లతో దాడి చేయించిన మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై దాడిని నిరసిస్తూ.. జిల్లా టీడీపీ శ్రేణులు అందోళన చేపట్టాయి. మంత్రి సురేష్‌పై చర్యలు తీసుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు.

Nara Chandrababu
Nara Chandrababu

By

Published : Apr 23, 2023, 7:50 AM IST

Nara Chandrababu: మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లతో దాడి చేయించిన మంత్రి ఆదిమూలపు సురేష్ బాబును వెంటనే బర్తరఫ్ చేయాలని.. నల్ల జెండాలు, కండువాలు నల్ల చొక్కాలు ధరించి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు నిరసన తెలియజేశారు. శనివారం రాత్రి వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన.. అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు పీవీ సురేష్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో నల్ల జెండాలు, కండువాలు నల్ల షర్ట్​తో పాల్గొన్నారు.

రాళ్ల దాడి జగన్ రెడ్డి ఐ ప్యాక్ దే..పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడుఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనని అడ్డుకుని.. రాళ్లతో దాడి చేయడం వైసీపీ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఒక సివిల్ సర్వెంట్​గా ఉద్యోగ భాద్యతలు నిర్వహించి, ప్రస్తుతం మంత్రిగా ఉండి.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడి చేయడం దారుణం అని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్ల దాడి జగన్ రెడ్డి ఐ ప్యాక్ దేనని.. రూట్ మ్యాప్ తెలుసుకొని మరీ దాడికి దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని.. జగన్ రెడ్డి సమావేశాల్లో ప్రతిపక్షాలు నిరసనలకు పోలీసులు అనుమతిస్తారా అని ప్రశ్నించారు.

అంబేద్కర్ విదేశీ విద్య రద్దు..మంత్రి సురేష్ రౌడీ మూకలను ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేయలేదని.. దళితుల్లో జగన్ రెడ్డిపై పెరుగుతున్న వ్యతిరేకత డైవర్ట్ చేయడానికి రాళ్లదాడి కుట్రపన్నరని ఆరోపించారు. జగన్​మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో లెక్కలేనన్ని దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని.. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 27 దళిత పథకాలను రద్దు చేశారని విమర్శించారు. 33 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్ళించి కార్పొరేషన్​లు నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్యను రద్దుచేసి అంబేద్కర్ విదేశీ విద్యలో అంబేద్కర్ పేరు తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు.

ప్రజలలో తిరుగుబాటు మొదలైంది..ఈ నాలుగేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని.. అందుకే ఈ నెల 24న దళిత ప్రజాప్రతినిధులతో అమరావతిలో జగన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, సమావేశాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఇటువంటి సిగ్గులేని నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్న వారిని సీఎం జగన్​ గమనించాలని కోరారు. వైసీపీ పార్టీ నాయకులు వికృత చేష్టలు, వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న అఘాయిత్యాలకు ప్రజలలో తిరుగుబాటు మొదలైందని.. స్థానిక శాసనసభ్యులు కూడా నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికలలో మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు దొంగలొస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తెలుగుదేశానిదేనని తెలిపారు.

"దళితుల్లో జగన్ రెడ్డిపై పెరుగుతున్న వ్యతిరేకత డైవర్ట్ చేయడానికి రాళ్లదాడి కుట్రపన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రిపై దాడి చేయడం దారుణం. చంద్రబాబుపై రాళ్లతో దాడి చేయించిన మంత్రి ఆదిమూలపు సురేష్ బాబును వెంటనే బర్తరఫ్ చేయాలి." -జీవీ ఆంజనేయులు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు

చంద్రబాబుపై దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details