TDP RELEASE THE VIDEO ABOUT MACHARLA ISSUE: పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ దాడులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కీలక వీడియో విడుదల చేసింది. తనను హత్య చేసేందుకు జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు టీడీపీ నేతలు ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన చల్లా మోహన్ వీడియో బయటకు వచ్చింది. మాచర్లలో ఘర్షణలకు ముందు చల్లా మోహన్ కత్తి పట్టుకుని కూర్చున్నట్లుగా వీడియో రికార్డు అయ్యింది. ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న బ్రహ్మారెడ్డిని చంపడానికే చల్లా మోహన్ ఆ కత్తి తీసుకువచ్చారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.
మాచర్ల ఘటనకు సంబంధించి కీలక వీడియో రిలీజ్ చేసిన టీడీపీ - మాచర్ల ఘటన వీడియో
TDP RELASED VIDEO : రాష్ట్రంలో సంచలనం రేకిత్తించిన మాచర్ల ఘటనకు సంబంధించిన ఓ వీడియోను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. తనను హత్య చేసేందుకు టీడీపీ నేతల ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన చల్లా మోహన్.. మాచర్లలో ఘర్షణలకు ముందు కత్తి పట్టుకుని కూర్చున్నట్లుగా వీడియో రికార్డు అయ్యింది.
TDP RELEASE THE VIIDEO ABOUT MACHRLA ISSUE
మోహన్ కత్తి పట్టుకుని ఉన్నప్పుడు ధరించిన దుస్తులు.. రోడ్డుపైన టీడీపీ నేతలతో ఘర్షణ పడుతున్నప్పుడు ధరించిన దుస్తులు రెండూ ఒకటిగానే ఉన్నాయన్నారు. దీన్నిబట్టి టీడీపీ నేతలపై దాడి కోసం వైసీపీ ముందస్తు ప్రణాళికతో ఉందని యరపతినేని ఆరోపించారు. పోలీసులు ఈ వీడియో ఆధారంగా చల్లా మోహన్‌పై హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: